ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 3:44 PM IST

kodi_katti_case

Kodi Katti Case Srinu Deekha : జగన్​పై కోడి కత్తి దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. తన కేసుపై సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలన్న డిమాండ్​తో రేపటి (ఈ నెల 18) నుంచి విశాఖ జైలులో నిరాహార దీక్ష చేయనున్నాడు. సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడంతో ఐదేళ్లుగా తన కుమారుడు జైల్లోనే మగ్గుతున్నాడని, తన కుమారుడ్ని విడుదల చేసి న్యాయం చేయాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు కన్నీటిపర్యంతమయ్యారు. శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నుంచి విజయవాడలో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ఆయన సోదరుడు సుబ్బరాజు తెలిపారు.  

నా కుమారుడు ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి కోర్టుకు రావడం లేదు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. నా కుమారుడిని విడుదల చేయించి మా కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుతున్నా. - సావిత్రి, శ్రీను తల్లి

నా సోదరుడిపై కేసు పెట్టి జగన్​ ఎన్నికల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్​ కోర్టుకు వెళ్లడం లేదు. సాక్ష్యం చెప్పడం లేదు. జడ్జిలు కూడా మాకు న్యాయం చేయడం లేదు. మా ప్రాణాలైనా అర్పించి ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నాం. - సుబ్బరాజు, శ్రీను సోదరుడు

ABOUT THE AUTHOR

...view details