ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kidney Smuggling gang arrest: ఆసుపత్రిలో స్వీపర్​.. దళారిగా మారి కిడ్నీ రాకెట్​.. నలుగురు అరెస్ట్​

By

Published : Aug 2, 2023, 10:59 PM IST

Updated : Aug 3, 2023, 6:20 AM IST

విజయవాడలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్​.. నిందితులు అరెస్ట్

Kidney Smuggling Gang arrested in Vijayawada: ఆసుపత్రిలో స్వీపర్​గా పని చేశాడు.. కిడ్నీ దళారిగా మారాడు. పేదరికం, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నీ దందాకు తెరలేపాడు. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు అడ్డంగా బుక్కయ్యాడు కార్తీక్. విజయవాడ కేంద్రంగా జరిగిన కిడ్నీ దందాలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు గత నెల 27వ తేదీన వెస్ట్ తహసీల్దార్ లక్ష్మీ దగ్గరకు వచ్చింది. దరఖాస్తులో వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని గమనించారు. వరుసగా రెండోసారి ఇదే తరహాలో దరఖాస్తు రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పేదరికంలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని డబ్బు ఎరవేసి ఉచ్చులోకి లాగుతున్నాడని పోలీసులు గుర్తించారు. కార్తీక్ అనే వ్యక్తి వాళ్ల భార్య నాగమణి, తాడి శెట్టి వెంకయ్య, లక్ష్మి మొత్తం నలుగురిపై సెక్షన్ 199 సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేశారు. వాళ్లకు బ్లడ్ టెస్ట్, ఇతర పరీక్షలు నిర్వహించి దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ చేస్తారని పోలీసులు గుర్తించారు. గతంలో లక్ష్మి అనే మహిళ కిడ్నీ దానం చేసింది. లక్ష్మి ప్రమేయంతోనే ఈ కిడ్నీ మార్పిడికి ప్రయత్నం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో మొదట్లోనే కిడ్నీ మార్పిడి ప్రయత్నాన్ని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. 

Last Updated : Aug 3, 2023, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details