ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kalpavruksha Vahana Seva in Tirumala: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై విహరించిన స్వామివారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 12:57 PM IST

Kalpavruksha Vahana Seva in Tirumala

Kalpavruksha Vahana Seva in Tirumala :తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం రాజమన్నార్‌ అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.

Srivari Navaratri Brahmotsavam Celebrations 2023 in Tirumala : క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అతి విలువైన కల్పవృక్షంపై అధిరోహించి మాఢ వీధుల్లో విహరించే స్వామివారిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు తీరతాయన్న విశ్వాసంతో.. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి వాహనసేవ ముందు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. గజరాజులు, అశ్వాలు ముందు నడువగా కల్పవృక్షవాహనంపై ఆసీనులైన మలయప్ప స్వామి మాఢవీధుల్లో విహరించారు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి మాఢవీధుల్లో నుంచి భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details