ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Judges Visited Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారి సేవలో పలువురు న్యాయమూర్తులు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 5:27 PM IST

Judges_Visited_Tirumala_Srivari_Temple

Judges Visited Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ బేలా త్రివేది, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ జై సూర్య, రవినాథ్ తిల్హరి, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ సంగీత చంద్రలు వేరు వేరుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భ గుడిలో స్వామివారిని దర్శించుకున్న వారంతా.. అనంతరం స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం న్యాయమూర్తులకు రంగనాయకుల మండపంలో పండితులు.. వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోవింద నామస్మరణలతో తిరుగిరులు మార్మోగుతున్నాయి. దర్శనానికి చాలా సమయం పట్టడంతో కొంత మంది భక్తులు తిరుమలేశుడ్ని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంటున్నారని.. పాలు, ఆహారం లేక చంటిబిడ్డలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details