ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pothina Mahesh on Jagananna Colonies: "జగనన్న కాలనీలా.. చేపల చెరువులా.."

By

Published : Jul 29, 2023, 6:02 PM IST

పోతిన మహేశ్​

Janasena Leader Pothina Mahesh On Jagananna Colonies: జగనన్న కాలనీలు నివాసయోగ్యం కాదని.. చేపలు పట్టుకోవటానికే పనికి వస్తాయని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేశ్​ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు.. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద కేటాయించిన జగనన్న కాలనీని పోతిన మహేశ్​ సందర్శించారు. వెలగలేరులో జగనన్న కాలనీ ఆరు నెలలు నీటిలో మునిగి మాయమవుతున్నాయని అన్నారు. ప్రధాన రహదారి నుంచి జగనన్న కాలనీకి వెళ్లేదారిలో.. బుడమేరు వరదల వల్ల రోడ్డు తెగిపోయి వారం రోజులపాటు రాకపోకలు స్తంభించిపోయాయని తెలిపారు. కనీసం మౌలిక వసతులనూ జగనన్న కాలనీలకు కల్పించలేదని ఆరోపించారు. వెలగలేరు జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించిన దగ్గర్నుంచి.. ఇప్పటి వరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్​కు పేదల ఇళ్ల నిర్మాణం దృష్టి లేదని.. ప్రభుత్వ భూముల కబ్జా, దేవాలయాల దోపిడీ చేసి అవినీతి సొమ్ము కూడగట్టడం పైనే దృష్టి ఉందని విమర్శించారు. మంత్రి జోగి రమేశ్​ గృహ నిర్మాణాల శాఖ మంత్రి కాదని.. ఏ ఎండకు ఆ గొడుగు పడతారని దుయ్యబట్టారు. 

ABOUT THE AUTHOR

...view details