ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagan Samajika Sadhikara Bus Yatra in Proddatur : ప్రొద్దుటూరులో విద్యాసంస్థలకు సెలవిచ్చిన వైసీపీ బస్సు యాత్ర...

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 2:04 PM IST

Jagan Samajika Sadhikara Bus Yatra in Proddatur

Jagan Samajika Sadhikara Bus Yatra in Proddatur :వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం కోసం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సులను తరలించడంపై యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.   వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా జనాలను తరలించేందుకు బస్సులు పంపాల్సిందేనంటూ రవాణాశాఖ ఆదేశించిందని యజమానులు తెలిపారు. ఆదేశాల మేరకు సుమారు 70 బస్సులను ఆర్టీవో కార్యాలయం వద్దకు పంపించామని అన్నారు. బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాల్సి వచ్చిందంటూ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Schools, Collages Bund in Proddatur Due to Samajika Sadhikara Yatra 2023 : ఈ నెల 26న వైఎస్​ఆర్​సీపీ మొదలు పెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం మూడురోజులు దాటకుండానే జనాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. నడి రోడ్డుపై కార్యక్రమానికి వేదికలు ఏర్పాటు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలుగిస్తున్నాయి. అది నిన్నటి సమస్య మూడోరోజు కొన్ని చోట్ల ఏకంగా పాఠశాలలకు సెలవు ప్రకటించే వరకూ వచ్చింది. బస్సు యాత్ర కోసం ప్రజల్ని తరలించడానికి స్థానికంగా ఉన్న విద్యాసంస్థల బస్సులు తీసుకెళ్లిన ఘటన ప్రొద్దుటూరులో జరిగింది.  

ABOUT THE AUTHOR

...view details