ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jada Shravan meets Nara Lokesh: 'ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి జగన్‌కు భయం పట్టుకుంది... అందుకే కుయుక్తులు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 10:56 PM IST

Jada_Shravan_meets_Nara_Lokesh

Jada Shravan meets Nara Lokesh: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి అత్యంత చీకటి రోజులు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ గుండె ధైర్యంతో ఉండాలని, జగన్ కక్షపూరిత..రాక్షస పాలనపై కలిసి పోరాటం చేద్దామని జడ శ్రావణ్‌ భరోసానిచ్చారు. 

Jada Shravan Comments: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను జడ శ్రావణ్‌ కలిసి సంఘీభావం తెలిపారు. తండ్రిని (చంద్రబాబు) అక్రమంగా అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టడాన్ని ఒక బిడ్డగా తట్టుకుని నిలబడాలని, గుండె ధైర్యంతో ఉండాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జడ శ్రావణ్.. ముఖ్యమంత్రి జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తోంది. వైసీపీ పార్టీకి సీఐడీ, పోలీసులు అనుబంధంగా పనిచేస్తున్నారు. చంద్రబాబుకి జైలులో పడుకోవడానికి సరైన మంచం కూడా ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి జగన్‌కు భయం పట్టుకుంది. అందుకే కుయుక్తులు పన్నుతున్నాడు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు అరెస్ట్ మాయని మచ్చ. ప్రజల హక్కుల కోసం కలిసి పోరాడుతాం. చంద్రబాబు అరెస్ట్‌తో సంబరాలు చేసుకునే మంత్రులు కూడా ఎన్నో ఫైల్స్‌పై సంతకాలు చేశారు. వారు దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తాం. ప్రజల హక్కుల కోసం మేమంతా కలిసే పోరాడుతాం'' అని ఆయన అన్నారు. 

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను జడ శ్రావణ్ ఖండించారు. జగన్ కక్షపూరిత, రాక్షస పాలనపై కలిసి పోరాటం చేస్తాం. నా తండ్రి అక్రమ అరెస్ట్ సమయంలో బాధలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడిన జైభీమ్ భారత్ పార్టీ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాం. జడ శ్రావణ్ మాకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పారు. రాక్షస పాలనకు చరమ గీతం పాడేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి. జడ శ్రావణ్ దళితుల సమస్యలపై, జగన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు.-నారా లోకేశ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details