ఆంధ్రప్రదేశ్

andhra pradesh

IT Raids on Gold Shops in Proddatur: వైఎస్సార్ జిల్లాలో ఆగని ఐటీ దాడులు.. ఆందోళనతో దుకాణాలు మూసివేసిన స్వర్ణకారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 12:41 PM IST

IT_Raids_on_Gold_Shops_in_Proddatur

IT Raids on Gold Shops in Proddatur :వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా ప్రముఖ బంగారం వ్యాపారుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలలో పాటు తల్లం, గురు రాఘవేంద్ర జువెలర్స్​లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 

IT Officers Searches in Jewellery Shops :బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. భారీ అక్రమ బంగారం నిల్వలతో పాటు డబ్బును అధికారులు గుర్తించినట్లు సమాచారం. పొరుగు ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా బంగారం దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. ఐటీ అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు చేస్తున్నారన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారుల దుకాణాలను వ్యాపారులు మూసి వేశారు (Jewellery Shops Closed). దసరా పండుగ సమయంలో దుకాణాలన్నీ మూత పడటంతో బంగారం ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details