ఆంధ్రప్రదేశ్

andhra pradesh

IPS Officers Transferred in AP: ఏపీలో 11 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరంటే..?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 4:01 PM IST

Updated : Sep 5, 2023, 6:55 PM IST

11_IPS_Officers_Transferred_in_AP

11 IPS Officers Transferred in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్ రెడ్డి అధికారుల జాబితాకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం నాడు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా రవిశంకర్‌ అయ్యన్నార్‌ను నియమించింది. ఇప్పటిదాకా సీపీగా ఉన్న త్రివిక్రమ వర్మను స్పెషల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీగా బదిలీ చేసింది. విశాఖపట్నం శాంతిభద్రతల డీసీపీగా కె.శ్రీనివాసరావును, విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ను నియమించింది. 

వైఎస్సార్‌ జిల్లా ఎస్పీగా సిద్దార్థ్‌ కౌశల్‌ నియమించింది. అనంతపురం జిల్లా ఎస్పీగా అన్బురాజన్‌‌ను నియమించగా.. అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావును నియమించింది. ఇక.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్‌‌ను నియమించగా.. గ్రేహౌండ్స్‌ ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడును నియమించింది. 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్. గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయీం అస్మీకి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Last Updated : Sep 5, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details