ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికార పార్టీ నేతల ఇసుక దందా - పోలీసులు పట్టించుకోకపోవడంతో అడ్డుకున్న టీడీపీ, జనసేన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:38 PM IST

illegal_transportation_of_sand_in_palnadu_district

Illegal Transportation of Sand in Palnadu District :పల్నాడు జిల్లా అమరావతిలో అధికార పార్టీ నాయకుల అక్రమ ఇసుక రవాణాను టీడీపీ, జనసేన నాయకులు అడ్డుకున్నారు. కృష్ణా నదిలో ఇసుకను తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, ప్రోక్లేన్లకు అడ్డంగా కూర్చుని నిరసన తెలియజేశారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా సహజ సంపదను దోచుకుంటూంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులకు, టీడీపీ, జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇసుక రీచ్‌ల నుంచి బలవంతంగా పంపించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Protest on YCP Illegal Sand  Transportation : పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ, జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ప్రాంతంలో పోలీసులు సైతం ఉండగా... ఏం చేస్తున్నారు? అడ్డుకోండి అన్నా కూడా పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ , జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details