ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Illegal Liquor Selling YSRCP Leader Arrest : "నేను అధికార పార్టీ నాయకుడిని.. నన్నే అరెస్టు చేస్తారా?".. వైసీపీ నేత ఆగ్రహం

By

Published : Aug 19, 2023, 3:19 PM IST

Illegal Liquor Selling YSRCP Leader Arrest

Illegal Liquor Selling YSRCP Leader Arrest : రాష్ట్రంలో మద్యాన్ని రూపుమాపుతానని ప్రతిపక్ష నేతగా ప్రతిజ్ఞ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. సరికదా.. ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకొన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు సైతం మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తే దాడులను దిగడం, మానసికంగా హింసించడం అనంతపురం జిల్లాలో చూశాం. ఈ ఘటన మరవక ముందే.. తాజాగా ప్రకాశం జిల్లాలో హోటళ్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆ నాయకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం చర్చనీయాంశమైంది. వైసీపీ చెందిన నారు అశోక్ రెడ్డి హోటల్​లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. రైడ్స్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను వైసీపీకి చెందిన నాయకుడినని చెప్పుకొన్న ఆయన.. తనలాగే చాలా మంది వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నా వాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై కుట్రలతోనే ఇబ్బంది పెడుతున్నారని అశోక్ రెడ్డి ఆరోపించారు.

"నేను వైఎస్సార్ పార్టీ.. జెండాలు కట్టి.. రంగులు పూసిన.. అధికార పార్టీలో ఉన్న వారిని అరెస్టు చేపిస్తారా మీరు.. నియోజక వర్గంలో వ్యాపారాలు చాలా మంది చేస్తున్నారు. మొత్తం ఆపండి. కాకా హోటల్ వాళ్లు కూడా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మందే అమ్ముతున్నాను. అక్రమ మందు తెస్తున్నానేమో చూడండి..నేను ఒక్కన్నే అమ్ముతున్నానా?"- నారు అశోక్ రెడ్డి, వైసీపీ నేత

ABOUT THE AUTHOR

...view details