ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP HC on Ex Minister Narayana Relatives Petition: రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ బంధువుల పిటిషన్‌పై ముగిసిన విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 8:20 PM IST

Ex_Minister_Narayana_Relatives_Petition

High Court Hearing on Ex Minister Narayana Relatives Petition: అమరావతి రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, బంధువు రావూరి సాంబశివరావు, సిబ్బంది ప్రమీలలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో వేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరుఫు న్యాయవాది, సీఐడీ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్లపై 41A నిబంధనలు అనుసరిస్తామని, ఇప్పటికే నోటీసులు అందజేశామని సీఐడీ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఐడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషన్లపై విచారణ ముగించింది.

అసలు ఏం జరిగిందంటే..రాజధాని బృహత్‌ ప్రణాళిక రూపకల్పన, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ 2022లో పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధింంచి కొన్ని రోజులక్రితం మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉద్యోగి ప్రమీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ.. నారాయణ, రమాదేవి, ప్రమీల హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఆ వ్యాజ్యాలపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లపై విచారణ ముగించింది.

ABOUT THE AUTHOR

...view details