ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Heavy Flood to Kadapa District: వైఎస్సార్ జిల్లాలో నిండుకుండలను తలపిస్తున్న నదులు.. సంతోషంలో రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 10:54 PM IST

Heavy Flood Water Coming to Kadapa District

Heavy Flood to Kundu and Penna Rivers in Kadapa District:  ఎగువ ప్రాంతంలో పడిన భారీ వర్షాల కారణంగా వైఎస్సార్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుందూ న‌ది ప‌ర‌వ‌ళ్లు తీస్తోంది. రాజోలి ఆన‌క‌ట్ట వ‌ద్ద ఈరోజు ఉద‌యం 11 వేల క్యూసెక్కుల ప్ర‌వాహం ఉండ‌గా సాయంత్రానికి 33 వేల‌కు పెరిగింది. చాపాడు మండ‌లంలోని సీతారామ‌పురం వ‌ద్ద వంతెన అంచులను తాకుతూ న‌దిలో నీరు ప్ర‌వ‌హిస్తోంది. చిదానందం దిగుల సగిలేరు జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. వర్షాల కారణంగా 500 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. ఇక్కడికి వచ్చి చేరుతున్న నీటిని కమలాకూరు ఆనకట్టకు పంపిస్తున్నారు. రేపు ఉదయానికి ఆనకట్ట నిండే అవకాశం ఉంది. దీంతో దీనికింద ఉన్న ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులు: మరోవైపు చెన్నూరు వంతెన వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవాహస్తోంది. నీటి ప్రవాహం మధ్యలో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. ఆరుగురిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలో సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ముద్దనూరు మండల శివారులో కల్వర్టు వద్ద వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details