ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వంద అడుగుల కల్వర్టు కట్టలేని సీఎం పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారు : జనసేన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 6:52 PM IST

guntur_to_bapatla_road_condition

Guntur To Bapatla Road Condition : వంద అడుగుల కల్వర్టు కూడా నిర్మించలేని జగన్ పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో బాపట్ల జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిలో అధ్వానంగా ఉన్న చప్టాను టీడీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక కల్వర్టును నిర్మించలేని జగన్ వైనాట్ 175 , మా నమ్మకం నువ్వే జగన్ అని ఎలా రాష్ట్ర ప్రజలపై రుద్దుతారని ఆరోపించారు. ఈ చప్టా వద్ద ఎంతో మంది వాహనదారులు పడిపోయి గాయాల పాలయ్యారని చెప్పారు. 

చప్టా వద్ద నీరు నిలిచి ఉండటం వల్ల ఇటీవల మృతి చెందిన ఓ యువకుడి శవం పూడ్చేందుకు ప్రొక్లెయిన్​ ​తో పూడిక తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వం చప్టా వద్ద నిర్మాణానికి చర్యలు తీసుకోకపోతే జనసేన, టీడీపీ కార్యకర్తలంతా కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద, సీఎం కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details