ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దీపారాధన చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్ - ఆ సమయంలో ఇంట్లోనే దంపతులు, ఇద్దరు కుమారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 3:22 PM IST

fire_accident_visakha

Gas Cylinder Exploded in The House Visakha District : విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మధురవాడ ప్రాంతంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న పెద్ద యామల బాలరాజు ఇంట్లో.. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఇంట్లో తనతో పాటు ఉంటున్న తన భార్య, ఇద్దరు కుమారులు మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. సిలిండర్​కు రెగ్యులేటర్ తగిలించే క్రమంలో గ్యాస్ లీక్ అయ్యింది. ఈ విషయం గమనించకుండా యామల బాలరాజు.. ఉదయం దీపారాధన చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

మంటలను ఆర్పాలని ప్రయత్నించిన బాలరాజుకి 50 శాతం కాలిన గాయాలయ్యాయి. అతని భార్యకు 20 శాతం.. ఇద్దరు కుమారులు 30 శాతం గాయపడ్డారు. బాలరాజు ఇంట్లో మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. స్థానికుల సహకారంతో.. గాయపడిన కుటుంబ సభ్యులను.. చికిత్స నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details