ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నరసరావుపేట టిక్కెట్ ఎవరికి?' - బరిలో ఉన్నానంటున్న బ్రహ్మారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 2:58 PM IST

Gajjala_Brahma_Reddy_on_Narasarao_Peta_MLA_Ticket

Gajjala Brahma Reddy on Narasarao Peta MLA Ticket: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చినట్లు అధిష్ఠానం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకుడు గజ్జెల బ్రహ్మారెడ్డి అన్నారు. టికెట్‌ విషయంలో తానూ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. సీటు ఎవరికి కేటాయించినా పార్టీ ఆదేశానుసారం వారితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

"గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినట్లుగా భావించి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్లు అధిష్ఠానం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అధిష్ఠానంతో నేను కూడా సీటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాను. అధిష్ఠానం కూడా నరసరావుపేట అసెంబ్లీ సీటు ఎవరికనేది ఇంకా ప్రకటించలేదు. పార్టీ కార్యకర్తల సమస్యలు నా దగ్గరకు తీసుకురావడం వల్లే స్థానిక నాయకుడిపై వ్యతిరేకత ఏర్పడింది. అధిష్ఠానం నరసారావుపేట సీటు ఎవరికి కేటాయించినా పార్టీ ఆదేశానుసారం వారితో కలిసి పనిచేస్తాను."- గజ్జెల బ్రహ్మారెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత

ABOUT THE AUTHOR

...view details