ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Four Years Girl Died in Gun Misfire in Kakinada District: విషాదం.. నాటు తుపాకీ పేలి.. నాలుగేళ్ల చిన్నారి మృతి

By

Published : Aug 16, 2023, 11:02 AM IST

four-years-girl-died-in-gun-misfire

Four Years Girl Died in Gun Misfire in Kakinada District: నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జిల్లాలో ఈ ఘటన జరగగా.. చిన్నారి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావ అంటూ చిన్నారి కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికుల చేత కంటతడి పెట్టించింది. 

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో.. ఓ వ్యక్తి పందులను చంపేందుకు నాటు తుపాకి సిద్ధం చేసుకున్నాడు. అందులో గుళ్లు నింపే క్రమంలో అది పేలింది. ఈ క్రమంంలో అక్కడే ఆడుకుంటున్న బాలికకు ఆ గుండు తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు లోవ కొత్తూరుకు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరీశీలించి విచారణ చేపట్టారు. తుపాకి మిస్​ఫైర్​ అయి పేలిందని పోలీసులకు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో తుపాకీ వినియోగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తుపాకీ మిస్​ఫైర్​ అయ్యిందా లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details