ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువత లక్ష్యంగా గంజాయి అమ్మకాలు - పోలీసుల అదుపులో ఆరుగురు, గన్​ స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 3:40 PM IST

Four_People_Arresed_for_Selling_Ganja

Four People Arrested for Selling Ganja: వ్వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రెండు కేసుల్లో ఆరుగురిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, పిస్టల్ తో బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న మరో ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అనంతపురం జిల్లాలో యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేసే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారి నుంచి మూడున్నర కిలోల గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

Man Arrested for Threatining With Pistol:మరో కేసులో  పిస్టల్​తో బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని సుధాకర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు చేశాడు.దీంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.గుత్తికి చెందిన రామ్మో​హన్, ప్రశాంత్​ అనే ఇద్దరు వ్యక్తులు జార్ఘండ్​లో ఓ వ్యక్తి నుంచి పిస్టల్ కొనుగోలు చేసి సుధాకర్​ను బెదిరించి సొమ్ము లాక్కున్నారు. అంతటితో ఆగకుంగా డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు  గుత్తికి చెందిన నిందితులతో పాటు, జార్ఖండ్​కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో పాల్గొని కేసుల వివరాలు వెల్లడించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details