Fire Accident In Old Equipment Godown: కడప శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లునట్లుగా బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవటంతో అక్కడున్న వారు ఊపీరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప శివారులోని బుడ్డాయిపల్లె వద్ద భరత్ నాయక్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పాత సామగ్రి గోడౌన్ నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం వేకువజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సహయంతో భరత్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. గోడౌన్లో ఉన్నది ప్లాస్టిక్ సామాగ్రి కావటంతో.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో దాదాపు కోటిన్నర విలువచేసే సామాగ్రి కాలిపోయినట్లు భరత్ వివరించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఆ ప్రాతంలో దట్టమైన పొగ వ్యాపించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పక్కనున్న దుకాణాలకు వ్యాపిస్తాయోమోనని యాజమానులు భయాందోళనకు గురయ్యారు.