ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers Union Leader Comments on jagan సాగునీరు లేదు.. పూడిక తీయలేదు..గేట్లు బాగోలేవు! వ్యవసాయ సంక్షోభంపై ఈ నెల 6న రాష్ట్రవ్యాప్త నిరసనలు..!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 5:31 PM IST

Farmers Union Leader Comments on jagan

Farmers Union Leader Comments on jagan: రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా... ప్రభుత్వం మీనా మేషాలు లెక్కిస్తుందని రైతు సంఘాల నేతలు దుయ్యబట్టారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ... కేంద్రం కృష్ణా జలాల పునః పంపిణీపై గెజిట్ విడుదల చేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా... నిటీపారుదల శాఖ మంత్రి కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కాలువల పూడిక తీయక, గేట్లు బాగుచేసే దిక్కు లేక, పొలాలకు నీళ్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందవచ్చిన పొలాలు బీటలు వారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటికరిస్తామని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నవంబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని కేంద్రం చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26, 27 తేదీల్లో మహా పడావ్ (మహా ధర్నా) ను నిర్వహిస్తున్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details