ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైఎస్సార్ భూ రక్ష సర్వే లోపభూయిష్టం' - అక్రమాలు జరిగాయని రైతుల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 7:36 PM IST

farmers_removing_bhuraksha_survey_stones

Farmers removing Bhuraksha survey stones: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం పేరిట వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం క్షేత్ర స్థాయిలో లోపభూయిష్టంగా మారింది. భూముల రీసర్వే పేరుతో భూ తగాదాలు కట్టడి చేస్తామంటూ జగన్ సర్కార్ చేస్తున్న భూ రక్ష పథకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నల గడ్డ గ్రామంలో వైఎస్సార్ జగన్ అన్న భూ రక్ష పథకంలో భాగంగా అధికారులు పాతిన సర్వే రాళ్లను గ్రామస్థులు తొలగించారు. భూముల్లో అధికారులు రీ సర్వే చేసి అనంతరం సరిహద్దు రాళ్లు  నాటించారని, కానీ సర్వేలో అక్రమాలు జరిగాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కొలతలలో తేడాలు రావడంతో భూ సర్వేని వ్యతిరేకిస్తూ సర్వే తొలగిస్తున్నామని రైతులు చెబుతున్నారు.

తాజాగా సీపీఐ నారాయణ ఈ పథకంపై స్పందిస్తూ, జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నారని, ఈ పుస్తకంలో డొల్ల తనమే తప్ప, కనీసం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. కనీసం బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా పనికి రాదని, కేవలం జగన్ తన బొమ్మను అచ్చు వేసి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా పుస్తకాలతో అన్ని రకాలు సేవలు అందేవని, కానీ ఈ పాస్​ పుస్తకంతో ఏ ఉపయోగం లేదని నారాయణ మండిపడ్డారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details