ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh Interview: రాష్ట్రం మేలు కోసం టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలి: నారా లోకేశ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 10:39 PM IST

special-interview-with-nara-lokesh

ETV Bharat Special Interview with Nara Lokesh:యువగళం పాదయాత్ర విజయవంతం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంహా మాట్లాడిన లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదనీ లోకేశ్ వెల్లడించారు.  అదే సమయంలో గత 5 ఏళ్లుగా తప్పు చేస్తూ వస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. రాష్ట్రం తిరిగి గాడిలో పడి ప్రజలకు మేలు జరగాలంటే, తెలుగుదేశం - జనసేన కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ పై పోరాడేందుకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ సర్కార్ అమలు చేసిన పరిపాలన విధానాలన్నింటికీ తెలుగుదేశం ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. డబ్బులేకుండా రాజకీయాలు చేయలేమనీ, కేవలం డబ్బుతోనే రాజకీయం కూడా చేయలేమని అభిప్రాయపడ్డారు. ఏది మంచి ఏది చెడు అని బేరీజు వేసుకునే ప్రజలు ఓటేస్తారనే ఫలితం తెలంగాణలో చూశామని లోకేశ్  విశ్లేషించారు. 

ABOUT THE AUTHOR

...view details