ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pratidwani: ఏపీలో సీఐడీ తీరు వివాదస్పదం.. గొంతెత్తితే కేసులు పెట్టి నానాయాతనకు గురిచేయడం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 10:01 PM IST

CID_Actions_in_Andhra_Pradesh

Pratidwani: ఏపీలో నేర దర్యాప్తు సంస్థ తీరు వివాదస్పదంగా మారిపోయింది. చట్టప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడవాల్సిన సీఐడీ.. కొందరు ప్రభుత్వ పెద్దల ఆలోచనల మేరకు నడుస్తోందన్న విమర్శలు కోకొల్లలు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతోపాటు.. చాలా ఉదంతాల్లో ఆ సంస్థ మితిమీరి వ్యవహరించిందనే ఆరోపణలు అనేకం. వాక్​ స్వాతంత్య్రం కలిగిన ప్రజలు ప్రభుత్వ తీరు నచ్చక సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన తీరునుంచి.. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, సామాన్యులు ఇలా ఎవరైనా గొంతెత్తితే  కేసులు పెట్టి నానా యాతన పెడుతున్న ఉదాంతాలకు లెక్కే లేదు. ప్రభుత్వ సంస్థగా రాజ్యంగం ప్రకారం విధులు నిర్వహించాల్సిన సీఐడీ వివాదాస్పద నిర్ణయాలు, కేసులతో.. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కె విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలు, చట్టప్రకారం నడవాల్సిన సంస్థ ఎలా పడితే.. అలా నడిచేందుకు వీలుందా. అసలు చట్టాలను అపహస్యం చేసే అధికారం సీఐడీకి ఉందా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. 

ABOUT THE AUTHOR

...view details