ఆంధ్రప్రదేశ్

andhra pradesh

prathidwani: రాష్ట్రంలో ధరల మోత – ఛార్జీలు, పన్నుల పేరుతో ప్రజలకు వాత

By

Published : Apr 12, 2023, 9:39 PM IST

prathidwani

prathidwani: గడిచిన నాలుగేళ్లలో కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్ ధరలు 3 సార్లు మోత మోగించారు. మరోవైపు ఆస్తి పన్ను, చెత్త పన్నుల షాకులు. పొరుగు రాష్ట్రాల కంటే... రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉన్న పెట్రోల్‌, డీజిల్ ధరలు ఈ మంటలకు అదనం. ఇన్ని రకాల పన్నులు, ఛార్జీలకు తోడు మోయం లేని భారంగా మారిన నిత్యావసరాల ధరలు. అసలు ఈ విషయంలో నాలుగేళ్ల క్రితం వరకు ప్రతిపక్ష నేతగా ఇదే జగన్ మోహన్ రెడ్డి.. అన్న మాట, ఇచ్చిన హామీల అమలేమయ్యింది? బాదుడే బాదుడు.. అంటూ వ్యక్తం చేసిన ఆవేదనలన్నీ ఎటు పోయాయి? పేద, మధ్య తరగతి వర్గాలను ఆ మంటల నుంచి బయట పడేయాల్సింది పోయింది.. నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో సగటు మహిళల పరిస్థితి ఏమిటి? పెరిగిన ధరలు, మోత మోగుతున్న ఛార్జీలు, పన్నులతో ఇంటి బడ్జెట్‌ నిర్వహణ ఎలా ఉంది? నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం కనీసం నిలబెట్టుకునే ప్రయత్నం చేసిందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details