ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాస వేడుకలు - వైభవంగా పగళ్ పథోత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 2:49 PM IST

dhanurmasa_utsavalu_in_visakha_simhadri_appanna_temple

Dhanurmasa Utsavalu in Visakha Simhadri Appanna Temple : విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న(Visakha Simhachalam Simhadri Appanna)  సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైభవంగా పగళ్ పథోత్సవాలు నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ బేడా మండపం చుట్టూ స్వామి వారిని, అమ్మవార్లను ఊరేగించారు. అనంతరం పండితులు, పురోహితులు వేద పారాయణం చేశారు. శనివారం స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. 

Visakha Simhadri Appanna Temple :ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు (Devotees) పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. విశేష పూజలతో స్వామి వారిని ఆరాధించారు. వైకుంఠ ఏకాదశికి స్వామి వారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చే భక్తులకు తగిన సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు (Temple managment) పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details