ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DGP Rajendranath Reddy on Political leaders tours రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారానికి పూర్తి స్వేచ్ఛ ఉంది: డీజీపీ

By

Published : Aug 12, 2023, 8:35 PM IST

DGP_inaugurated_Sub_Divisional_Office

DGP Rajendranath Reddy on Political leaders tours: రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రచారానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతనంగా నిర్మించిన నరసాపురం సబ్ డివిజనల్ కార్యాలయంను ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఘర్షణలు జరగకుండా నివారించేందుకు స్వచ్ఛందముగా క్రమ శిక్షణ పాటించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పుంగనూరులో జరిగింది ఇదేనని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసు ద్వారా మంచి సాధించవచ్చునని దీనికి నరసాపురం నిదర్శనమన్నారు. తీవ్ర, అతి తీవ్ర నేరాలపై నమోదైన కేసులను సత్వర పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తీవ్రమైన నేరాల్లో బాధ్యులు తప్పించుకునేందుకు వీలు లేకుండా ప్రత్యేక విధానాలు అమలుకు చర్యలు చేపట్టాం.. 20 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించే అవకాశం ఉందన్నారు. 1.50 కోట్లు మహిళలు దిశా యాప్​లో నమోదు అయ్యారు.. వీరిలో 2,700 మంది పోలీస్ సేవలు పొందారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details