ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPS Agitation in AP : "కాలిలో ముల్లు తీస్తాడని నమ్మితే.. ఏకంగా జీపీఎస్ రూపంలో పెద్ద మేకు గుచ్చాడు"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 10:44 AM IST

CPS_ Agitation_ in_ AP

 CPS Agitation in AP : కాలిలో ముల్లు తీస్తాడని సీపీఎస్ (CPS) ఉద్యోగులు జగన్ రెడ్డిని నమ్మితే ఇప్పుడు ఏకంగా జీపీఎస్ రూపంలో వారికి పెద్ద మేకు గుచ్చాడని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ ధ్వజమెత్తారు. 2004లో తండ్రి.. 2023లో కొడుకు.. పోటీలు పడీ మరీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సీపీఎస్ గురించి పూర్తిగా తెలియకుండా హామీ ఇచ్చామని జగన్ రెడ్డి, సజ్జల చెప్పడం ఉద్యోగుల చెవుల్లో పూలు పెట్టడమేనన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాప్పుడు చంద్రబాబు ఉద్యోగుల మేలుకోసం 62 జీవోలిచ్చి వారు అడిగినవన్నీ అమలుచేశారని గుర్తు చేశారు. 3.50 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు కన్నెర్రజేస్తే జగన్ సర్కార్ ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు పదవీ విరమణానంతరం ఆర్థిక భద్రత కల్పించడమనేది ప్రభుత్వాల బాధ్యతని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఆ తీర్పుకు భిన్నంగా జగన్ సర్కార్ జీపీఎస్ విధానం తీసుకొచ్చిందని ఎద్దేవా చేసారు. జగన్ రెడ్డి చెబుతున్న గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) లో పెన్షన్ కు ఎక్కడ గ్యారంటీ ఉందో ఆయనే చెప్పాలని ఆక్షేపించారు. 

ABOUT THE AUTHOR

...view details