ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Ramakrishna Responded on Medical College Seats: "ప్రతిభ గల పేద వైద్య విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది : సీపీఐ రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 6:59 PM IST

CPI_Ramakrishna_Responded_on_Medical_College_Seats

CPI Ramakrishna Responded on Medical College Seats:వైద్య కళాశాల సీట్ల భర్తీ అంశంలో ప్రభుత్వ విధానాల వల్ల.. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నంద్యాలలోని వైద్య కళాశాలను ఆయన సందర్శించి పరిశీలించారు. డబ్బులున్న వారికే వైద్య సీటు వచ్చేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని ఆరోపించారు. రిజర్వేషన్ పక్రియను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.

డబ్బులు ఉన్నవారు ప్రైవేట్​ వైద్య కళాశాలలను ఆశ్రయిస్తారన్నారు. విద్యకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నవారికి వైద్య విద్యలో సీట్లు కల్పించటం సరైంది కాదని అన్నారు. దీనివల్ల బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్​ను కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు అన్యాయం చేసే జీవోలనూ వ్యతిరేకిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సంఘాలను ఆహ్వానించి.. వారితో కలిసి ఉద్యమం చేపడతామని వెల్లడించారు. ఇదే విధానాన్ని తీసుకువచ్చి ఎన్. జనార్ధన్​ రెడ్డి విఫలమయ్యారని రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details