ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Ramakrishna on Krishna Delta Farmers: తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం: రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 2:54 PM IST

CPI Ramakrishna on Krishna Delta farmers

 CPI Ramakrishna on Krishna Delta Farmers: పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కృష్ణా డెల్టా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఎప్పుడూ మూడు పంటలు పండించే కృష్ణా డెల్టా రైతులు పంటలకు నీరు అందక.. పైరు ఎండిపోతుందని కన్నీరు పెడుతున్నారంటే ఈ పరిస్థితి ఎపుడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరవుతో పంటలు ఎండిపోతుంటే, బోర్ల కింద పంట బతికించుకునే అవకాశం లేకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కోతలు పెడుతోందన్నారు. తీవ్ర వర్షాభావంతో రైతులంతా నష్టపోయినా సీఎం, మంత్రులు కనీసం రైతుల పొలం వద్దకు కూడా రావడం లేదన్నారు. వేరుసెనగ పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు తక్షణ సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంట నష్టపోయిన రైతుల క్షేత్రాలను ఆయన పరిశీలించారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details