ఆంధ్రప్రదేశ్

andhra pradesh

fake notes constable: దొంగనోట్ల వ్యవహారం.. కానిస్టేబుల్ కిడ్నాప్​న​కు వైఎస్సార్సీపీ నేతల యత్నం!

By

Published : Jul 10, 2023, 5:24 PM IST

దొంగ నోట్ల వ్యవహారంలో కానిస్టేబుల్

YSRCP leaders attempted to kidnap constable: పోలీస్ కానిస్టేబులే కదా.. తమ డబ్బుకు గ్యారెంటీ ఉంటుందని భావించారు అధికార పార్టీ నాయకులు. లక్షకు మూడు లక్షలు వస్తాయని చెప్తే ఎంతో సంబరపడిపోయి డబ్బులు అప్పగించారు. తీరా మోసపోయామని తెలిసి కానిస్టేబుల్ కిడ్నాప్​న​కు యత్నించారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు ఆగమేఘాలపై కానిస్టేబుల్​ను బదిలీ చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. వైఎస్సార్సీపీ నాయకులతో సత్సంబంధాలున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగ నోట్ల వ్యవహారంలో తలదూర్చాడు. బళ్లారి, హైదరాబాద్ గ్యాంగులతో కలిసి పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడికి యత్నించాడు. రూపాయికి మూడు రూపాయల చొప్పున ఒప్పందంతో స్థానిక వైఎస్సార్సీపీ నేతల నుంచి 30లక్షలు వసూలు చేశాడు. కాగా, తాము ఇచ్చిన 30 లక్షల తాలూకూ డబ్బులు తిరిగి రాకపోవడంతో కారుమంచికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు కానిస్టేబుల్​ను కిడ్నాప్ చేయడానికి యత్నించారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. పోలీస్ శాఖ పరువుపోతుందనే ఉద్దేశంతో కానిస్టేబుల్​ను గుట్టుచప్పుడు కాకుండా ​కర్నూలుకు బదిలీ చేశారు. కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఏడాది నుంచి జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్​లో పని చేస్తుండగా.. అతడు తీసుకున్న డబ్బుల గురించి ఉన్నతాధికారులు బాధితులను విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దొంగ నోట్ల వ్యవహారంలో బళ్లారి, హైదరాబాద్ గ్యాంగ్ ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details