ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Class War between YCP leaders: వైసీపీ నాయకుల వర్గ పోరు.. పొలాలకు నీరందించే హంద్రీనీవా ఉపకాల్వ పూడ్చివేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 12:09 PM IST

Class_War_between_YCP_leaders

Class War between YCP leaders: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో వైసీపీ నాయకులకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పొలాలకు దారి లేదంటూ.. చెరువుకు కృష్ణా జలాలను అందించే హంద్రీనీవా ఉపకాలవను వైసీపీ నాయకులు పూడ్చివేశారు. బాలేపాలెం సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి.. కాటన్ చెరువుకు నీరు ఇచ్చేందుకు.. అప్పటి మంత్రి పరిటాల సునీత చొరవచూపారు.

పొలాలకు దారి లేదన్న కారణంతో..ఈ క్రమంలో 2016 సంవత్సరంలో అప్పటి మంత్రి పరిటాల సునీత కాల్వను తవ్వించారు. కాగా, దాన్ని ఆనుకొని గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకుల పొలాలు ఉన్నాయి. దీంతో పొలాలకు వెళ్లేందుకు దారి లేదనే కారణంతో ఆ ఇద్దరు 300 మీటర్ల మేర కాల్వను యంత్రాలతో పూడ్చివేశారు. కాటన్ చెరువు కింద వైసీపీ సర్పంచ్ వర్గానికి చెందిన వారి పొలాలు ఎక్కువగా ఉన్నాయి. చెరువు నిండితే సర్పంచ్ వర్గం నాయకుల పొలాలకు నీరు వెళుతుందనే అక్కసుతో.. వైసీపీలోని ఇంకో వర్గం.. కాల్వను పూడ్చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details