ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Quash Petition Hearing: చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 10:38 AM IST

Chandrababu_Quash_Petition_Hearing

Chandrababu Quash Petition Hearing in Supreme Court Today :స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోని 6వ నెంబర్‌ కోర్టులో ఐటెం నెంబర్ 63 కింద లిస్టయిన ఈ కేసును జస్టిస్​  అనిరుద్దబోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

High Court Hearing on Chandrababu Bail Petition in Amaravati Inner Ring Road Case Today :అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుపై (IRR Case) నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్​పై మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్‌ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details