ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై ఏపీ అధికారులతో సీఈసీ భేటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 10:58 PM IST

CEC Meeting Of AP Officials Preparations For General Elections

CEC Meeting Of AP Officials Preparations For General Elections:సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ మేరకు జనవరి 9, 10 తేదీల్లో  కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బృందం భేటీ కానుంది. 2024 ఓటర్ల జాబితా, రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు అవకతవకల అంశంపై సమీక్ష నిర్వహించనుంది. ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ పై ఈసీఐ బృందం సమీక్షించనుంది. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షలు చేయనుంది. అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణా, చెక్ పోస్టుల ఏర్పాటు, శాంతి భద్రతలపై అధికారులతో చర్చించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details