ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT LIVE VIDEO: లోయలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

By

Published : Apr 17, 2023, 3:24 PM IST

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

CAR ACCIDENT: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి కొండ పైనుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని దేవరకొండ సమీపంలోని కొండ మీద రాయుడి గుడిలో దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి కారులో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్​ ఉమాపతిగా పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆర్థిక ఇబ్బందులు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొండపై నుంచి కారు పడటం వల్ల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో బయటపడనుంది. 

ABOUT THE AUTHOR

...view details