ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమస్యను చెప్పేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన బాలుడు - అవాక్కయిన గ్రామస్థులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 12:38 PM IST

Boy Criyed For Road in Karnool District

Boy Criyed For Road in Karnool District :తమ కాలనీలో రోడ్డు వేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఓ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తమ కాలనీలో కొలతలు తీసుకొని వేరే కాలనీలో రోడ్డు వేస్తున్నారంటూ కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన బాలుడు వాపోయాడు. తెలుగుదేశం సీనియర్ నేత కోట్ల సుజాతమ్మ 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా గూళ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు వింత అనుభవం ఎదురైంది. గ్రామస్తులు బాలుడిని వారిస్తుండగా సుజాతమ్మ వారిని అడ్డుకున్నారు. పూర్తిగా చెప్పమని బాలుడికి ధైర్యం చెప్పారు.

TDP Leader Kotla Sujathamma Babu Surity Programme :తమ కాలనీలో రహదారి మార్గం సరిగ్గా లేదని, తెలుపుతూ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అంతమంది ప్రజలు చెప్పలేని సమస్యను ఆ పిల్లవాడు చెప్పడం కార్యక్రమంలోని వారందరినీ కదిలించింది. రోడ్డులేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అంత భావోద్వేగంగా తమ అసౌకర్యన్ని వెలిబుచ్చాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పూర్తిగా విన్న సుజాతమ్మ.. బాలుడికి ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details