ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ పాపం ఎవరిది - పింఛన్ తొలగించారన్న ఆవేదనతో అంధురాలు ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 10:12 PM IST

Blind_Woman_Commits_Suicide_Due_to_Pension_Removed

Blind Woman Commits Suicide Due to Pension Removed: పింఛన్ తొలగించారని ఆవేదనతో అంధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి తండాలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవమ్మ, సోమ్లా నాయక్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. పెద్ద కుమార్తె సరోజమ్మ పుట్టుకతోనే అంధురాలు, రెండు చెవులు వినిపించవు. తల్లి, తమ్ముడితో కలిసి ఒకే రేషన్ కార్డులో మృతురాలు సరోజమ్మ కూడా ఉన్నారు. 

తమ్ముడికి లోకో పైలట్ ఉద్యోగం రావడంతో సరోజమ్మకు పింఛన్ తొలగించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఏడాది నుంచి పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో మూగ, అంధురాలు అని తెలిసినా వాలంటీర్లు పింఛన్ జాబితా నుంచి సరోజమ్మ పేరును తొలగించడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details