ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bapatla SP on Vetapalem YCP Clashes: రామన్నపేట ఘర్షణల్లో గాయపడ్డ పోలీసులు.. 40మందిపై కేసు నమోదు

By

Published : Aug 11, 2023, 8:27 PM IST

Bapatla_SP_on_Vetapalem_YCP_Clashes

Bapatla SP on Vetapalem YCP Clashes: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో పంచాయతీ ఉప ఎన్నిక నామినేషన్ల సందర్భంగా గురువారం జరిగిన ఘర్షణల్లో గాయపడిన కానిస్టేబుళ్లు సునీత, శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు సునీత, శ్రీనివాసరావులకు ఆయన ఆర్థిక సాయం అందించారు. గాయపడిన కానిస్టేబుల్​ సునీత, శ్రీనివాసరావులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ వకుల్​ జిందాల్​ వారికి భరోసా ఇచ్చారు. రామన్నపేట ఘర్షణలకు కారకులైన వారిలో ఇప్పటికే 40 మంది మీద కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఘర్షణకు గల కారణలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. రామన్నపేట పంచాయితీలోని 6, 10 వార్డులకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నామినేషన్లు సమర్పించే సమయంలో ఆమంచి కృష్ణమోహన్​, కరణం బలరామకృష్ణ మూర్తి వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది. అది కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది.

ABOUT THE AUTHOR

...view details