ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విలేకరుల సమావేశంలో ధూళిపాళ్ల - హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 12:44 PM IST

Updated : Nov 17, 2023, 12:58 PM IST

attemt_to_mueder_case_on_ex-mla_dullapally

Attemt To Murder Case on EX MLA Dullapally : పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదైంది. పాల విక్రయానికి సంబంధించి 14 శాతం బోనస్‌ ఇవ్వలేదని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన పాడిరైతులు ప్రశ్నించగా... మాట్లాడుదామని డెయిరీ వద్దకు పిలిచి నరేంద్ర వర్గీయులు తమపై కర్రలతో దాడిచేసినట్లు పాడి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sangam Diary Formers Complaint on Dullapally :దాడిలో తమ మూడు కార్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. పాడి రైతు రాము ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర సహా 15మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 14వ ముద్దాయిగా నరేంద్ర పేరు చేర్చగా... సంఘటన జరిగిన సమయంలో ఆయన పొన్నూరులో విలేకరుల సమావేశంలో ఉన్నారని టీడీపీ వర్గీయులు వివరించారు. సంబంధం లేని వ్యక్తుల పేర్లు కేసులో ఇరికించారని వారు ఆరోపించారు.

Last Updated : Nov 17, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details