ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Attack on TDP Activist Narayana: వైసీపీ మూకల దాష్టీకం.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాదయాత్ర చేస్తున్న వృద్ధుడిపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 2:16 PM IST

Attack_on_TDP_Activist_Narayana

Attack on TDP Activist Narayana: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నంద్యాల జిల్లా చినదేవళాపురం నుంచి పాదయాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్త చింతల నారాయణపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో ఇవాళ ఉదయం నారాయణపై దాడి జరిగింది. ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు తనపై దాడికి పాల్పడినట్లు నారాయణ తెలిపారు. నారాయణపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయనను వినుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే తరహాలో అధినేత అరెస్టును తట్టుకోలేని నారాయణ.. నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు సొంతూరు చినదేవళాపురం నుంచి రాజమండ్రికి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వినుకొండ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వినుకొండ దాటి నాలుగు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత రెండు ద్విచక్ర వాహనాలపై  వచ్చిన నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని నారాయణ తెలిపారు. అసభ్యంగా తిట్టారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ దాడిలో తనకు దవడకు గాయమైందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details