ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణా జలాల తరలింపు - రైతులతో వైఎస్సార్సీపీ నాయకుల వాగ్వాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:15 PM IST

argument_ycp_farmers

Argument Between YCP Leaders and Farmers Over the Diversion of Krishna Water :కృష్ణా జలాల తరలింపుపై వైఎస్సార్సీపీ నాయకులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది. హంద్రీనీవా 34 ప్యాకేజీలో డీ2 ఉప కాలువ నుంచి నింబగల్లు జీబీసీకి తరలించాలని వైఎస్సార్సీపీ  నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం గుంతకల్లు డీఎస్పీ వరకు వెళ్లడం వల్ల ఇరువురితో సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు.

Meeting with DSP in Dispute : ప్రస్తుతం డీ2 ఉప కాలువ కింద 6 వేల ఎకరాలకు పైగా మిరప సాగులో ఉంది. నింబగల్లు వద్ద ఉన్న కాలువ నుంచి నీటిని తరలిస్తే ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నింబగల్లు వద్ద నుంచే నీటిని తరలించాలని వైసీపీ నేతలు పేర్కొనడం వల్ల ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తాము నష్టపోయే చర్యలను సమర్థించలేమంటూ రైతులు అక్కడి నుంచే వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details