ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వార్డు సభ్యులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం - అందరూ చూస్తుండగానే బాహాబాహీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 12:17 PM IST

ward_members_fight_with_mla

Argument Between Grama Panchayat Ward Members and MLA:పైప్​లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు, ఎమ్మెల్యే మధ్య పోలీసుల సమక్షంలోనే వాగ్వాదం జరిగిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అంబాజీపేట మండలంలోని కె పెదపూడి గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులతో దాదాపు 25 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్వహించే తాగునీటి పైపు లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని సర్పంచ్ బీర శాంతితో పాటు వార్డు సభ్యుడు రాజారావు తదితరులు ఎమ్మెల్యే చిట్టిబాబుతో వాగ్వాదానికి దిగారు. 

ప్రోటోకాల్ ప్రకారం తమను గ్రామంలో నిర్వహించే అభివృద్ధి పనులకు పిలవాలని అలా ఎందుకు చేయలేదని ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. పి గన్నవరం సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై చైతన్య కుమార్ సమక్షంలో ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకుని అక్కడినుంచి వెనుతిరిగారు. 

ABOUT THE AUTHOR

...view details