ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రవాసాంధ్రుడు యశస్వికి ఊరట - సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 7:03 PM IST

ap_high_court_orders_cid_to_handover_passport_to_nri_yashasvi

AP High Court orders CID to handover passport to NRI Yashasvi : సీఐడీ (Crime Investigation Department) స్వాధీనం  చేసుకున్న ప్రవాసాంధ్రుడు యశస్వి పాస్‌పోర్టును రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఎన్నారై యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లి చూసేందుకు భారత్ కు వచ్చిన యశస్విని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరులోని కార్యాలయానికి తరలించారు.

ప్రవాసాంధ్రుడు యశస్వి కి  ఏపీ సీఐడీ పోలీసులు 41 ఏ నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే ఈ క్రమంలో కేంద్ర నేర పరిశోధన శాఖ అధికారులు యశస్వి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. తన పాస్ పోర్టు ఇప్పించాలని కోరుతూ యశస్వి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వెంటనే పిటిషనర్ కు పాస్ పోర్ట్ అందజేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details