ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై ట్రోలింగ్​ పిటిషన్ - మరోసారి విచారణ వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 12:11 PM IST

AP_High_Court_on_Social_Media_Trolls_on_Judges

AP High Court on Social Media Trolls on Judges :తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ (Advocate General Sriram) పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారణ జరిపిన హైకోర్టు  కోర్టుధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రతివాదుల జాబితాలో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలకు సంబంధించిన యాజమానులను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.

High Court Hearing Criminal Contempt Petition :ప్రతివాదుల్లో ఐదుగురి ఆచూకీ గుర్తించటం కష్టంగా మారిందని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. నకిలీ అకౌంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అన్నారు. మిగతా వారికి నోటీసులు ఇవ్వటానికి సమయం కావాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details