ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP leaders Illegal soil excavation: యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు.. ధ్వంసమైన రోడ్లు

By

Published : Jun 9, 2023, 2:32 PM IST

YCP leaders

Illegal excavation of soil by YCP leaders in I Polavaram: రాష్ట్రంలో అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) అండదండలతో గ్రామాల్లో ఉండే కొంతమంది వైసీపీ నాయకులు తెగ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టిని ఎందుకోసం తరలిస్తున్నారని అక్కడి స్థానిక ప్రజలు వారిని నిలదీయగా.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకంటూ మభ్యపెడుతున్నారు. 

యథేచ్ఛగా వైసీపీ నాయకుల మట్టి రవాణా.. దీంతో ఆ నాయకులను అడిగేవారూ లేక అడ్డుకునేవారూ లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో వాహనాలు గ్రామాల మధ్య తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరంలోని స్థానికులు మట్టి రవాణా చేస్తున్న వాహనాలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. జెసిబిలు, టాక్టర్లను సీజ్ చేసి మట్టి తవ్వకాలను నిలిపివేశారు.

జెసిబిలు, టాక్టర్లు సీజ్ చేసిన అధికారులు.. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరం మండలాలలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకే అని చెప్పి స్థానికులను.. అధికారులను మభ్యపెడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గ్రామాల మధ్య మట్టి రవాణా వాహనాలు తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయంటూ.. ప్రజలు అభ్యంతరం పెట్టినా.. స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు జెసిబిలు.. టాక్టర్లను సీజ్ చేసి మట్టి తవ్వకాలను నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details