ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anantapur SP on gang rape case: మహిళపై అత్యాచారం ఆరోపణలపై... ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. కానీ..!

By

Published : Aug 15, 2023, 10:37 PM IST

Anantapur SP revealed new details in gang rape case

Anantapur SP revealed new details in gang rape case: కళ్యాణదుర్గం కోడిపల్లి మహిళ చేష్టలు మంచివి కావని గ్రహించి, ఆమెకు హాని తలపెడతారనే కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. నిరుపేద ఎస్సీ మహిళపై గ్యాంగ్ రేప్ సంబంధించి పూర్వాపరాలను వివరించిన ఎస్పీ శ్రీనివాసరావు ఆమె మరో వ్యక్తితో కలిసి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించినట్లు తెలిపారు. ఈ సమాచారం పోలీసులకు తెలపటంతో తమ ఎస్సై గ్రామానికి వెళ్లి వారిద్దరినీ వెలుపలికి పిలిపించి విచారణ చేశారన్నారు. ఈలోపే ఆమె జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ మహిళకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ ద్వారా విచారణ చేయించటానికి ఆదేశించామని ఎస్పీ తెలిపారు. ఆ మహిళకు ఇంకా ఇబ్బందులుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మహిళ చెబుతున్నట్లుగా ఆమెను ఏవిధంగానైనా ఇబ్బందులు పెట్టినట్లు ఆధారాలు లభిస్తే కఠన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే పూర్తి విచారణ చేపట్టిన తరువాతే మిగితా అంశలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details