ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravati: కొనసాగుతున్న అమరావతి రైతుల నిరాహార దీక్ష.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

By

Published : May 8, 2023, 3:19 PM IST

Amaravati farmers protests

Amaravati farmers protests: ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన.. నిరంకుశత్వం రాష్ట్ర నలుమూలల వ్యాపించిందని రాజధాని రైతులు ఆరోపించారు. అమరావతిలో ఆర్​5 జోన్​ను రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెంలో రైతులు మూడోరోజు నిరాహార దీక్ష కొనసాగించారు. రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతుల దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. అతి త్వరలోనే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. 

వైఎస్ ప్రభావంతో ముఖ్యమంత్రి అయిన జగన్.. తన తల్లిని, చెల్లిని తిట్టిన వాళ్లనే పక్కన పెట్టుకున్నారని.. కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దీనిని బట్టి ఆయన నైజం ఏంటో అర్థం అవుతుందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తాము రిటన్బుల్ ప్లాట్లు తీసుకోకుండానే.. ఐదు శాతం స్థలాలను అప్పటి ప్రభుత్వం పేదలకు కేటాయించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పేదలకు వ్యతిరేకం కాదని సెంటు భుమి బదులు మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details