ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Missing in Canal: కాల్వలోకి దిగి ముగ్గురు గల్లంతు.. ఇద్దరు సేఫ్​ కానీ, ఒక్క వ్యక్తే..

By

Published : Jul 30, 2023, 12:23 PM IST

కాల్వలోకి దిగి ముగ్గురు గల్లంతు

A Man Missing in Canal At Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో కాలువలో దిగి ముగ్గురు వ్యక్తులు  గల్లంతయ్యారు. కాలువలో పెరిగిన గుర్రపు డెక్కను తొలగించటానికి దిగగా ఈ ప్రమాదం జరిగింది. కాలువను శుభ్రం చేయటానికి ముగ్గురు వ్యక్తులు కాలువలోకి దిగి గుర్రపు డెక్కలో చిక్కుకోగా.. వీరిలో ఇద్దర్ని స్థానికులు కాపాడారు. ముగ్గురిలో మరో వ్యక్తి ఆచూకీ లభించటం లేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి మండలంలోని ఓపెన్​ హెడ్​ కెనాల్​లో గుర్రపు డెక్క  విపరీతంగా పెరిగింది. దీనిని తొలగించటానికి ముగ్గురు వ్యక్తులు కాలువలోకి దిగారు. మధ్యాహ్నం సమయానికి కొంత మేరకు పనులు నిర్వహించగా.. ముగ్గురు కార్మికులు ఒక్కసారిగా కాలువలోని గుర్రపు డెక్కలో చిక్కుకున్నారు. వీరిని గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇద్దర్ని సురక్షితంగా రక్షించగా.. శాంతారావు అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. శాంతారావు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు అతని ఆచూకిీలభించలేదు. 

ABOUT THE AUTHOR

...view details