ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యకు ఇబ్బందిలేని విశ్వాసాలపై వివాదమెందుకు?

By

Published : Feb 11, 2022, 10:38 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాతలు. సామరస్యానికి, సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ఈ దేశంలో మతంపేరుతో, సంస్కృతి పేరుతో వైషమ్యాలు రగిలించే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. యూనిఫాం, ధార్మిక వస్త్రధారణ విషయంలో చినికిచినికి గాలివానగా మారిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకూ వ్యక్తిగత విశ్వాసాలు పాటించడంపై అభ్యంతరాలు ఉండరాదన్న ప్రజాస్వామిక విలువలకు ప్రమాదం ఏర్పడుతోంది. భారతీయ సమాజంలోని బహుళత్వం, సమ్మిళితత్వానికి విఘాతం కలిగించే చర్యలు మితిమీరుతున్నాయి. ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పుడు పౌర సమాజం పాటించాల్సిన సంయమనం ఏంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details