ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం.. మరో ఇద్దరు గల్లంతు

By

Published : May 10, 2022, 4:57 AM IST

వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు వారి కోసం వెతికి.. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను అశ్రయించారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

మిస్సింగ్
మిస్సింగ్

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. హనుమాన్ నగర్​కు చెందిన పిట్టా రేవతి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె కావ్యశ్రీ (12) , అదే వీధికి చెందిన వెంకట రంగయ్య , రమాదేవి కుమార్తె రాజరాజేశ్వరి(12) అనే బాలికలు జీవనజ్యోతి పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. సోమవారం సాయంత్రం రాజరాజేశ్వరి ఇంటి నుంచి ఇద్దరు బాలికలు బయటికి వెళ్లారు. అనంతరం బాలికలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. అయినప్పటికీ వారి ఆచూకీ తెలియక పోవడంతో మూడో రాణా పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ అధారంగా పిల్లల కోసం గాలిస్తున్నారు.

వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఆదివారం పరీక్ష ఉందని.. ఇంట్లో నుంచి వెళ్లిన షేక్‌ మునీర్‌ బేగం తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు సింహాద్రిపురం ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో ఇంటర్ చదవుతున్నట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

పల్నాడు జిల్లా :రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామ శివారులో ఉన్న పిల్లివాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన బీమవరపు సాయి చరణ్ (ఆరవ తరగతి), జలగం నాని(తొమ్మిదో తరగతి) ఇద్దరూ కలిసి ఈతకు వెళ్లి.. వాగులో ఉన్న పుట్టిలో ఎక్కారు. ప్రమాదవశాత్తు అది తిరగపడటంతో ఇద్దరు విద్యార్థుల గల్లంతయ్యారు.కుటుంబసభ్యులు, గ్రామస్థులు.. విద్యార్థుల ఆచూకీ కోసం గాలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సమీర్ భాషా నేతృత్వంలో మత్స్యకారులతో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:Children Missing: విశాఖ శిశుగృహం నుంచి ముగ్గురు చిన్నారులు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details