ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి.. మరోచోట విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Mar 26, 2023, 5:11 PM IST

Several crimes in state: భార్యను కాపురానికి పంపలేదని కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అదే జిల్లాలోని తొట్టిగారిపల్లె 67వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి శనివారం కళాశాల సమీపంలోని వ్యవసాయ బావిలో మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని పలమనేరు ఫైర్ సిబ్బంది వెలికి తీశారు.

Several crimes in state
Several crimes in state

Several crimes in state: వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం తొట్టిగారిపల్లె వద్ద 67వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బద్వేలు కుమ్మరి కొట్టాల నుంచి కొంతమంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మైదుకూరుకు చెందిన మరో ప్రయాణికుడు.. షబ్బీర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రత్యేక వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీతో పాటు.. చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు బద్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అత్తపై అల్లుడు కత్తితో దాడి.. భార్యను కాపురానికి పంపలేదని కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ రోడ్​లో కాపురం ఉంటున్న రమాదేవి తన కుమార్తె శిరీషను వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చి 15 ఏళ్ల క్రిందట వివాహం చేశారు. శ్రీనివాసరెడ్డి శ్రీహరికోటలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండడంతో భార్య శిరీష పుట్టింట్లోనే ఉంటుంది. భార్యను కాపురానికి పంపించమని శ్రీనివాసులు రెడ్డి అత్తను కోరాడు. కానీ ఆమె పంపకపోవడంతో కోపోద్రికుడైన శ్రీనివాసరెడ్డి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి కత్తి తీసుకొని అత్తపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. వెంటనే విషయం తెలుసుకున్న శిరీష తల్లిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించింది.. శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ పోలీసులు తెలిపారు.

రైలు పట్టాలపై మృతదేహం..అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్​లో ఒక వృద్ధుని మృతదేహం పట్టాలపై పడివుంది. రాజంపేట పట్టణంలోని నాగులమాను వీధిలో నివాసముండే షేక్ షఫీ(54)గా పోలీస్​లు గుర్తించారు. మృతుడు గత ఆరు సంవత్సరాల నుంచి క్యాన్సర్​తో బాధపడుతున్నట్లు సమాచారం. మృతుడు రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు చనిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడు అనుమానాస్పద మృతి..చిత్తూరు జిల్లాపలమనేరు నియోజక వర్గం గంగవరం మండలం మెలుమాయి సమీపంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న తవణంపల్లి మండలం తొడకర గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు కేవీ బాలాజీ (20) అనే విద్యార్థి శనివారం కళాశాల సమీపంలోని వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది హత్యా లేదంటే ఆత్మహత్యా.. లేక ప్రమాదమా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

నెల్లూరు జిల్లా.. కోవూరు మండలం జమ్మిపాళెం ఇసుక రీచ్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇనమడుగు గ్రామంలో ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి.. పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన సుబ్రమణ్యం మృతదేహం పెన్నా నదిలో స్థానికులు గుర్తించారు. ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడా.. మరేదైనా కారణంతో మృతి చెందాడానని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో చోరీ..ఐతేపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో రాత్రి దొంగలు పడ్డారు ఆలయం వెనుక వైపు నుంచి లోనికి చొరబడ్డ దొంగలు తాళాలు పగులగొట్టి హుండీలోని నగదు అమ్మవారి తాళిబొట్లు మాయం చేశారు అలాగే సీసీ కెమెరాల హాడ్ డిస్క్ ఎత్తుకెళ్లారు ఉదయం వచ్చిన పూజారి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి ఆలయ ధర్మకర్తకు సమాచారం అందించారు ఆలయ ధర్మకర్త పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details